ఎక్సైజ్‌ అధికారుల దాడులు | Excise officers raids in vikarabad district | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌ అధికారుల దాడులు

Oct 18 2017 4:44 PM | Updated on Sep 5 2018 8:43 PM

బొంరాస్‌పేట(కొడంగల్‌): ఎక్సైజ్‌ అధికారులు నాటుసారా తయారీ కేంద్రంపై దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని వడిచర్ల అనుబంధ ఊరిముందలి తండాలో మంగళవారం చోటు చేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. తండాలో నాటుసారా తయారీ, అమ్మకంపై విశ్వసనీయ సమాచారం అందుకున్న సీఐ చంద్రశేఖర్, డీటీఎఫ్‌ సీఐ ధన్వంత్‌రెడ్డి సిబ్బందితో కలిసి తండాలో దాడులు నిర్వహించారు. తండాకు చెందిన ముఢావత్‌ చందు, ముఢావత్‌ మోహణ్, శివ, దేవమ్మ, లక్షిబాయి, నాన్యనాయక్‌ నుంచి సారా తయారీ సామగ్రి లభించింది. 13 లీటర్ల ఐడీ, డిట్రాయిడ్, 100 లీటర్ల షుగర్‌వాష్‌ను ధ్వంసం చేశారు. ఈమేరకు వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement