మరణాలు తగ్గించడమే లక్ష్యం..  | Sakshi
Sakshi News home page

మరణాలు తగ్గించడమే లక్ష్యం.. 

Published Fri, May 29 2020 1:37 AM

Etela Rajender Conducted Review On Gandhi Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో మరణాలు తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలని, దీనికోసం అవసరమైన అన్ని సదుపాయా లు అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కోఠిలో ని కరోనా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లో గాం ధీ వైద్య బృందం, మెడికల్‌ అడ్వైజరీ బోర్డ్‌తో మంత్రి గురువారం స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరింత జాగ్రత్త వహిం చాలని సూచించారు. గాంధీ ఆస్పత్రిని కోవిడ్‌–19 ఆస్పత్రిగా ప్రకటించుకుని కరోనా పాజిటివ్‌ పేషంట్లను అక్కడే ఉంచి చికిత్స అం దిస్తున్నామని, మే 27 వరకు 1,321 మందిని క్షేమంగా ఇంటికి పం పించామని తెలిపారు. 1,500 మంది పేషంట్లు ఉన్నా పూర్తిస్థాయి చికి త్స అందించేందుకు వైద్యుల, సిబ్బంది, డయాగ్నొస్టిక్స్, మందు లు ఎంత అవసరమో నివేదిక అందించాలని గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ రాజారావును మంత్రి ఆదేశించారు.

సర్వెలెన్స్‌పై దృష్టి పెట్టాలి..
కరోనాను ముందుగా గుర్తించడం ద్వారానే వ్యాప్తిని అడ్డుకోవచ్చని, అందుకోసం సర్వెలెన్స్‌పై దృష్టి పెట్టాలని మంత్రి అన్నారు. సర్వెలెన్స్, ఆస్పత్రు ల్లో ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించా రు. ఆశ వర్కర్స్‌ రోజూ ఇళ్లను సందర్శించి జ్వర పరీక్షలు చేయాలని కోరా రు. పీహెచ్‌సీ నుంచి కేర్‌ ఆస్పత్రుల వరకు ప్రతి హాస్పిటల్‌లో ఫీవ ర్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. జలుబు, దగ్గు, జ్వ రం ఉన్నవారిని మిగతా పేషంట్లతో కలవకుండా వేర్వేరుగా ఓపీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రీ సింప్టమాటిక్‌ ఉన్న వారికి హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని, ఆ సదుపాయం లేనివారికి జిల్లాల్లో అయితే జిల్లా ఆస్పత్రుల్లో, హైదరాబాద్‌లో అయితే ఆయుర్వేదిక్‌ మెడికల్‌ కాలేజీలో క్వారంటైన్‌ ఉంచాలని మంత్రి వైద్యాధికారులకు సూచించారు.

Advertisement
Advertisement