రాజ్ భవన్‌లో యోగా డే సెలబ్రేషన్స్‌

ESL Narasimhan Celebrates Yoga Day In Raj Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా యోగా డే కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే వేడుకలు జరుగుతుండగా.. రాజ్‌భవన్‌లోని సంస్కృతి భవనంలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. యోగ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  అందరికి యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగ అనేది మనుసుకు ఆహ్లాదాన్ని ఇస్తుందన్నారు. ఇకపై రోజు యోగ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు యోగ చేయాలని సూచించారు. యోగ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. రాజ్ భవన్ స్టాఫ్ అందరి కోసం యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.

ట్యాంక్‌బండ్‌ యోగాడేలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
ట్యాంక్‌బండ్‌ వద్ద జరుగుతున్నయోగా డే సెలబ్రేషన్స్‌లో టూరిజం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, టూరిజం సెక్రటరీ బుర్రా వెంకటేశం పాల్గొన్నారు. బుద్దుని విగ్రహం దగ్గర నిర్వహించిన ఈ వేడుకల్లో మంత్రి ఆసనాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. మనదేశంలో యోగ పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం యోగ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యోగాను తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రపంచ దేశాలు మన యోగాను ఫాలో అవుతున్నాయన్నారు. టూరిజంస్పాట్‌లో యోగాను ప్రమోట్‌ చేస్తామని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top