ఇంజినీరింగ్ విద్యార్థికి నిప్పు! | engineering student set fire on him! | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్ విద్యార్థికి నిప్పు!

Jun 15 2015 3:32 PM | Updated on Nov 9 2018 5:02 PM

ఇంజినీరింగ్ విద్యార్థికి నిప్పు! - Sakshi

ఇంజినీరింగ్ విద్యార్థికి నిప్పు!

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. శివమహేశ్‌ అనే ఇంజినీరింగ్‌ విద్యార్ధికి కొంతమంది దుండగులు నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.  శివమహేశ్‌  అనే ఇంజినీరింగ్‌ విద్యార్ధి ఒంటికి నిప్పంటుకున్న ఘటన మొయినా బాద్ మండలం హిమాయత్ సాగర్ లోని అభినవ్ హైటెక్ ఇంజినీరింగ్ కాలేజీ ఎదుట  కలకలం సృష్టించింది. తోటి విద్యార్ధులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని అతని స్నేహితులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో శివమహేశ్‌ శరీరం తొంభై శాతం కాలిపోయింది.

 

తీవ్రంగా గాయపడిన శివమహేశ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడా?లేక ఎవరైనా దాడి చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ గ్రామానికి చెందిన శివకు మొదట విజ్ఞాన్ జ్యోతి కాలేజీలో సీటు రాగా తల్లిదండ్రులకు తెలియకుండా స్లైడింగ్‌లో అభినవ్ కాలేజీని ఎంచుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement