కన్నెపల్లిలో వెట్‌రన్‌కు సన్నాహాలు

Engineering and contracting representatives are preparing to conduct motors testing - Sakshi

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపుహౌస్‌లో మోటార్లకు పరీక్షలు (వెట్‌రన్‌) నిర్వహించేందుకు ఇంజనీరింగ్, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. మొదట ఈ నెల 8, ఆ తర్వాత 15, 25 తేదీల్లో వెట్‌రన్‌ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినా సాంకేతిక పరమైన కారణాల వల్ల వాయిదా పడింది. ఆదివారం కన్నెపల్లి సమీపంలోని గోదావరి నుంచి అప్రోచ్‌ కెనాల్‌ ద్వారా నీటిని హెడ్‌ రెగ్యులేటరీలోని మూడు గేట్ల ద్వారా ఫోర్‌బేలోకి వదిలారు. అక్కడి నుంచి నీరు పంపుల కింద భాగంలోకి చేరుతుంది. ప్రస్తుతం పంపుహౌస్‌ వద్ద హడావుడి మొదలైంది. వెట్‌రన్‌ నిర్వహించే తేదీని మాత్రం అధికారులు వెల్లడించడంలేదు. నీటి స్థాయిలను ఎప్పటికప్పుడు ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, డీఈఈ సూర్యప్రకాశ్, మెఘా కంపెనీ ప్రతినిధులు సీజీఎం వేణుమాధవ్, పీఎం వినోద్‌ పర్యవేక్షిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top