పంచాయతీ భవనానికి విద్యుత్‌ షాక్‌ ! | Electric Shock To Panchayat Building | Sakshi
Sakshi News home page

పంచాయతీ భవనానికి విద్యుత్‌ షాక్‌ !

Jul 13 2018 9:16 AM | Updated on Sep 5 2018 2:26 PM

Electric Shock To Panchayat Building - Sakshi

గోడలకు విద్యుత్‌ సరఫరా అవుతోందని చూపిస్తున్న స్థానికుడు

బొంరాస్‌పేట: మండలంలోని రేగడిమైలారం పంచాయితీ భవనాన్ని ఎక్కడ ముట్టుకున్నా కరెంట్‌ షాక్‌ కొడుతోంది. భవనం ఎతైన భాగంలో గోడలకు విద్యుత్‌ తీగలు ఎక్కడో తగిలి, ప్రస్తుత వర్షాలకు గోడలు తడిసి విద్యుత్‌ షాక్‌ వస్తున్నట్లు గ్రామ సేవకులు, గ్రామస్తులు చెబుతున్నారు.

పంచాయితీ భవనంలోకి వెళ్లాలంటే జంకుతున్నారు. సర్పంచ్, విద్యుత్‌ సిబ్బంది స్పందించి దీన్ని నివారించాలని కోరుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున శుక్రవారం పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని విద్యుత్‌ సిబ్బంది తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement