ఉర్దూ, మరాఠీల్లో ఓటర్ల జాబితాల ప్రచురణ

Election Commission Prints Voter List In Marathi And Urdu Languages - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 16 శాసన సభ నియోజక వర్గాల్లో ఉర్దూ.. 3 నియోజక వర్గాల్లో మరాఠీ భాషల్లో ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రచురించింది. ఈ ఓటర్ల జాబితాను తమ కార్యాలయ వెబ్‌సైట్‌లో కూడా పొందుపరిచినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌ బుధవారం ఓ ప్రకట నలో తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఒక శాసన సభ నియోజకవర్గంలో అధికార భాష కాకుండా ఇతర భాష మాట్లాడేవారు 20% మించి ఉన్నా, ఇతర భాష అక్షరాస్యులు చెప్పుకో దగ్గ సంఖ్యలో ఉన్నా వారి కోసం ఓటర్ల జాబితా ఆ భాషల్లో ప్రచురించాలి.

హైదరాబాద్‌ జిల్లాలో ని ముషీరాబాద్, మలక్‌పేట, అంబర్‌ పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రా యణ్‌గుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పుర, సికింద్రాబాద్, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు.. ఇటు నిజామాబాద్‌ జిల్లాలోని నిజామాబాద్‌ (అర్బన్‌) నియోజక వర్గంలో ఓటర్ల జాబితాను ఉర్దూలో ప్రచురించా రు. అలాగే అదిలాబాద్‌ జిల్లాలోని బోధ్, నిర్మల్‌ జిల్లాలోని ముధోల్, నిజామాబాద్‌ జిల్లాల్లోని జుక్కల్‌ అసెంబ్లీ నియోజక వర్గాల్లో మరాఠీలో నూ ఓటర్ల జాబితా ప్రచురించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top