వృద్ధురాలి హత్య

Elderly Woman Murder In Khammam - Sakshi

అశ్వాపురం : ఇంటి స్థలం వివాదం నేపథ్యంలో ఓ వృద్ధురాలిని ఆమె కుటుంబీకులే హత్య చేశారు. మండలంలోని మల్లెమడుగు పంచాయతీలో శుక్రవారం ఇది జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు... మల్లెమడుగు గ్రామానికి చెందిన పిల్లికల్ల సీతమ్మ(82)కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమారుడు దశరథ్‌తో కలిసి గ్రామంలోనే ఉంటోంది. వీరి ఇంటి పక్కనే చిన్న కుమార్తె కడెం రమణ నివసిస్తోంది.

సీతమ్మకు, కుమార్తె రమణకు మధ్య కొంతకాలంగా ఇంటి స్థలం విషయమై వివాదం సాగుతోంది. గురువారం ఉదయం నుంచి సాయం త్రం వరకు సీతమ్మ, ఆమె కుమార్తె రమణ, ఆమె కుమారుడు సర్వేశ్వర్‌రావు.. గొడవపడ్డారు. రాత్రి సీతమ్మ తన ఇంటిలో పడుకుంది. తెల్లవారేసరికి మృతిచెందింది. ఆమె తలపై తీవ్ర గాయాలున్నాయి. పెద్ద కుమార్తె నాగమ్మ గమనించి స్థానికులకు, మిగిలిన కుటుంబీకులకు తెలిపింది.

సీతమ్మను ఆమె చిన్నకుమార్తె కడెం రమణ, మనవడు (రమణ కుమారుడు) సర్వేశ్వర్‌రావు కలిసి కొట్టి చంపారని పోలీసులు భావిస్తున్నారు. సీతమ్మను చంపుతామంటూ రమణ, అమె కుమారుడు బెదిరించినట్టు స్థానికులు చెప్పారు. హత్య ప్రదేశాన్ని సీఐ అల్లం నరేందర్, ఎస్సై రాంజీ పరిశీలించారు. మృత దేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. ఆమె పెద్ద కుమార్తె నాగమ్మ ఫిర్యాదుతో సీఐ అల్లం నరేందర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top