
వైద్యుడి నిర్వాకం..కడుపులోనే పైపు
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తుండగా కడుపులోనే పైపు ఉంచి కుట్లు వేసి ఇంటికి పంపించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
నల్లగొండ:
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తుండగా మహిళ కడుపులోనే పైపు ఉంచి కుట్లు వేసి ఇంటికి పంపించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చండూరు మండలం ఇడికుడ గ్రామానికి చెందిన రజిత జూన్ 2న ప్రసవం కోసం ఆసుపత్రికి రావడంతో డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేశారు. ఆడపిల్లకు జన్మనిచ్చింది రజిత. జూన్ 9న రజితను డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లిన దగ్గరి నుంచి కడుపు నొప్పి విపరీతంగా రావడంతో, మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి పట్టించుకోలేదు.
తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ వెళ్లి డబ్బులు ఖర్చుపెట్టుకొని ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకోగా కడుపులో పైపు ఉందని తేలింది. దీంతో అక్కడే డాక్టర్లు ఆపరేషన్ చేసి పైపును తీసివేశారు. ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తనకు ఈ పరిస్థితి వచ్చిందని అధికారులను కలిసి, సదరు డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరింది.