హైకోర్టు విభజనపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల వాగ్వివాదం | division of the High Court, the Congress, TRS fight | Sakshi
Sakshi News home page

హైకోర్టు విభజనపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల వాగ్వివాదం

Mar 11 2015 1:03 AM | Updated on Mar 18 2019 9:02 PM

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజన అంశంపై మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజన అంశంపై మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును డిమాండ్ చేస్తూ జీరో అవర్ సందర్భంగా టీఆర్‌ఎస్ సభ్యుడు కె.కేశవరావు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో 19 మంది జడ్జీలు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉండగా, తెలంగాణవారు ఆరుగురే ఉన్నారని తెలిపారు.

తెలంగాణ వాటా పోస్టులను వెల్లడించకుండానే జూనియర్ సివిల్ జడ్జీల నియామకం కోసం నోటిఫికేషన్  విడుదల చేయడాన్ని తెలంగాణ  బార్ సభ్యులందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. అయితే కేకే వాదనను కాంగ్రెస్ సభ్యులు జేడీ శీలం, వీహెచ్ వ్యతిరేకించారు. ఇరు పార్టీల సభ్యుల మధ్య వాదోపవాదాలు తీవ్రమై గందరగోళం నెలకొంది. దీంతో  రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ జేడీ శీలంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇలాగైతే మీపై చర్య తీసుకోవాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement