జవాన్‌ స్వామి తండ్రి అదృశ్యం

The Disappearance of Army Jawan Swamy's Father - Sakshi

సాక్షి, కామారెడ్డి: తన తండ్రి సాయిరెడ్డి మూడు రోజులుగా కనపడటం లేదని, ఎవరో కిడ్నాప్‌ చేసుంటారని ఆర్మీ జవాన్‌ స్వామి అనుమానం వ్యక్తం చేశారు. తన భూమిని కబ్జా చేశారని ఇటీవల సోషల్‌ మీడియాలో స్వామి వీడియో పెట్టారు. ఈ నేపథ్యంలో  ఆయన తండ్రి అదృశ్యం కావడం అనుమానాలకు తావిస్తోంది. తన తండ్రి  కనపడటం లేదన్న సమాచారంతో స్వామి ఈ రోజు హుటాహుటిన తన సొంతూరు కామారెడ్డిలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చేరుకున్నారు. తన తండ్రి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు మీడియాకువెల్లడించారు. ఈ పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కాపాడుకోవాలో లేక దేశ రక్షణ కోసం సరిహద్దులో ఉండాలో తోచడం లేదని జవాన్‌ స్వామి ఆందోళన చెందుతున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top