ప్రత్యక్ష ఎన్నికలు రావాల్సిందే: జీవన్రెడ్డి | Sakshi
Sakshi News home page

ప్రత్యక్ష ఎన్నికలు రావాల్సిందే: జీవన్రెడ్డి

Published Mon, Aug 25 2014 2:12 PM

ప్రత్యక్ష ఎన్నికలు రావాల్సిందే: జీవన్రెడ్డి - Sakshi

హైదరాబాద్: రేషన్ కార్డులు రద్దయితే ఆ భాద్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ లెక్కల ప్రకారమే 16 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు లేవని తెలిపారు. ప్రజా సమస్యల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సులో మాట్లాడుతూ... స్ధానిక ప్రజాప్రతినిధిలు ఫిరాయింపు ఆగాలంటే ప్రత్యక్ష ఎన్నికలు రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఫిరాయింపు ఆగాలంటే మండల, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ప్రత్యక్ష ఎన్నికలు జరగాల్సిందేనని సూచించారు.

Advertisement
Advertisement