విహార యాత్రలో విద్యార్థిని మృతి | Died a student on vacation | Sakshi
Sakshi News home page

విహార యాత్రలో విద్యార్థిని మృతి

Jan 13 2015 7:42 AM | Updated on Nov 9 2018 4:36 PM

విహార యాత్రలో విద్యార్థిని మృతి - Sakshi

విహార యాత్రలో విద్యార్థిని మృతి

విహార యాత్ర విషాదం నింపింది. భీమ్‌గల్ మండలంలోని బాచన్‌పల్లి గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థిని ఆకుల నిఖిత(15) పాఠశాల నుంచి వెళ్లిన విహార యాత్రలో మృతి చెందింది.

భీమ్‌గల్: విహార యాత్ర విషాదం నింపింది. భీమ్‌గల్ మండలంలోని బాచన్‌పల్లి గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థిని ఆకుల నిఖిత(15) పాఠశాల నుంచి వెళ్లిన విహార యాత్రలో మృతి చెందింది. వివరాల్లోకెలితే గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులను సంక్రాతి సెలవుల్లో విహార యాత్రకు తీసుకువెళ్లారు. సుమారు 50 మంది విద్యార్థులను 7 గురు ఉపాధ్యాయుల సంరక్షణలో ప్రయివేటు టూరిస్టు బస్సులో శనివారం బయలుదేరి వెళ్లారు.

ఆదివారం తమిళనాడులోని వేలూరుకు సమీపంలో వయాఅంబాడి గ్రామ సమీపంలో నిఖిత అస్వస్థతకు గురైంది. పాఠశాల సిబ్బంది స్థానికంగా వైద్యుడి వద్ద చికిత్స చేయించారు. చికిత్స అనంతరం కొద్దిగా ఆరోగ్యం కుదుటపడిందన్నారు. తెల్లవారు జామున మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురైందని, ఫిట్స్ రాగా వేలూర్‌లోని వైద్యకళాశాలకు తరలించామన్నారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు తెలిపారన్నారు. ఈ విషయం తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement