‘మైనార్టీలు అంటే కేవలం ముస్లింలే కాదు’

Dharmapuri Arvind Slams On TRS In Delhi - Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్‌ సనాతన పాపుల పార్టీ అని.. మైనార్టీలు అంటే కేవలం ముస్లింలే కాదని నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో హిందువులపై అత్యాచారాలు, బలవంతంగా మత మార్పిడులు జరుగుతున్నాయని తెలిపారు. అయితే హిందువుల బాధలు టీఆర్‌ఎస్‌ పార్టీకి ఏమాత్రం పట్టటం లేదని అర్వింద్‌ ధ్వజమెత్తారు. హిందువుల ఓట్లతో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలవలేదా అని ఆయన సూటిగా విమర్శించారు. గురుకుల పాఠశాలల్లో మత మార్పిడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పార్టీని ముస్లిం లీగ్‌లో కలపాలని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తమ పాపాలను కడుకునే పరిస్థితిలో లేదని ఎంపీ అర్వింద్‌ మండిపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికల కోసం ఎంఐఎంకు భయపడి టీఆర్‌ఎస్‌ పార్టీ పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించిందని ఆయన మండిపడ్డారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top