
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మీ వంతు సహకారం అందించాలని అనుకుంటున్నారా? చిన్న మొత్తం పెద్ద మొత్తం అనే తేడా లేకుండా మీకు తోచినంతగా విరాళాలు అందించి అండగా నిలవాలని భావిస్తున్నారా? అయితే సులువుగా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు పంపవచ్చు. ఈ కింద పేర్కొన్న సీఎం సహాయ నిధి బ్యాంకు ఖాతా (కరెంట్ అకౌంట్)కు మీరు డిపాజిట్/ట్రాన్స్‌ఫర్/చెక్కుల ద్వారా డబ్బులు పంపవచ్చని ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది.
CM RELIEF FUND,
TELANGANA STATE,
Account No. 62354157651,
IFSC code: SBIN0020077
Current Account, SBI, Secretariat Branch Hyderabad.
లేకుంటే ఈ కింద పేర్కొన్న లింక్ ద్వారా మీ–సేవ వెబ్‌సైట్‌ను తెరిచి సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆన్‌లైన్‌లో విరాళాలు పంపించవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ ఏర్పాట్లు చేసింది. https:// ts. meeseva. telangana.gov. in/Covid/ CovidContribution.htm