డీసీఎం-బైక్ ఢీకొని ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు.
హైదరాబాద్: డీసీఎం-బైక్ ఢీకొని ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు చెందిన అనిల్(25) హైదరాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతడు మంగళవారం బోయిన్ పల్లి నుంచి కళాశాలకు బైక్‌పై వెళ్తుండగా చింతల్ ఐడీపీఎల్ చౌరస్తా సమీపంలో డీసీఎం వెనుకవైపు ఢీకొట్టింది. దీంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(చింతల్)