breaking news
bike crashes
-
అమానవీయం: రక్తపు మడుగులో ఫిల్మ్‌మేకర్.. ఫోన్, కెమెరా దొంగతనం
ఢిల్లీ: సమాజంలో మానవీయ విలువలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సాటి మనిషికి చేయందించలేని దుస్థితికి చేరుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే దేశ రాజధానిలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి ఎవరూ సాయం చేయలేదు. సాహాయం చేయకపోగా బాధితుని ఫోన్, కెమెరాను ఎత్తుకుపోయారు. పీయూష్ పాల్ గురుగ్రామ్‌లో ఫిల్మ్‌మేకర్‌గా పనిచేస్తున్నాడు. దక్షిణ ఢిల్లీలోని పంచశీల్ ఎన్క్లేవ్ సమీపంలో రాత్రి 10 గంటలకు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పీయూష్ బైక్‌ను సిగ్నల్ వద్ద వెనక నుంచి వేగంగా వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. దీంతో బైక్ ఆయన్ని కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకుంటూ పోయింది. ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లడంలో జాప్యం జరిగినందునే పీయూష్ మృతి చెందాడని అతని స్నేహితులు చెబుతున్నారు. రక్తపు మడుగులో పడిన 20 నిమిషాల పాటు ఎవరూ రక్షించలేదని చెప్పారు. అంతేకాకుండా కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితుని ఫొటోలు, వీడియోలు తీశారని మండిపడ్డారు. తన స్నేహితుని వద్ద ఉన్న మొబైల్ ఫోన్, గో-ప్రో కెమెరాను దొంగిలించారని చెబుతున్నారు వాళ్లు. రాత్రి 10 వరకు ఫోన్ మోగిందని, ఆ తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చిందని పోలీసులకు తెలిపారు. తమకు న్యాయం జరగాలని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదీ చదవండి: ప్రమాదక స్థాయిలో ఢిల్లీ వాయు కాలుష్యం.. 616 పాయింట్లకు చేరిన గాలి నాణ్యాతా సూచీ -
డీసీఎం, బైక్ ఢీ..ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
హైదరాబాద్: డీసీఎం-బైక్ ఢీకొని ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు చెందిన అనిల్(25) హైదరాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతడు మంగళవారం బోయిన్ పల్లి నుంచి కళాశాలకు బైక్‌పై వెళ్తుండగా చింతల్ ఐడీపీఎల్ చౌరస్తా సమీపంలో డీసీఎం వెనుకవైపు ఢీకొట్టింది. దీంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చింతల్)