ఈ మందులు నిల్వ ఉంచండి

DCA reference to medical shops due to Covid-19 - Sakshi

కరోనా నేపథ్యంలో మెడికల్‌ షాప్‌లకు డీసీఏ సూచన

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి తీవ్రమవుతుండటం, రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని హోల్‌సేల్, రిటైల్‌ మెడికల్‌ షాపులకు డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సూచనలు జారీ చేసింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు నిర్ధేశించిన మందులను దుకాణాల్లో నిల్వ చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా స్టాకును నిర్వహించాలని, హోంఐసోలేషన్‌లో ఉన్న వారు మెడికల్‌ దుకాణాలపైనే ఆధారపడతారని, ముందు జాగ్రత్త చర్యలుగా దుకాణాల్లో వీటిని అందుబాటులో ఉంచాలని సూచించింది.

దుకాణాల్లో స్టాక్‌కు నిర్దేశించిన మందులివే
1. యాంటిబయోటిక్స్‌: అజిత్రోమైసిన్, డొక్సిసిలిన్, అమోక్సిసిల్లిన్‌ విత్‌ క్లావులానిక్‌ యాసిడ్, సిఫిక్సిమ్, సిఫొటాక్సిమ్‌ 2. సిట్రిజన్‌ లేదా ఫెక్సొఫెనాడిన్‌
3. పారాసిటమల్‌ 4. డెక్సామెథజోన్‌ లేదా మిథైల్‌ ప్రిడ్సిసొలోన్‌ 5. మల్టీవిటమిన్‌: జింక్, విటమిన్‌ సి, విటమిన్‌ డి 6. కాఫ్‌ సిరప్‌: బెనడ్రైల్‌ లేదా ఆంబ్రాక్సిల్‌ 7. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ 8. ఓసెల్టాంవీర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top