ప్రియాంకను హత్య చేసింది ఆ నలుగురే: సీపీ సజ్జనార్‌ | CP Sajjanar Press Meet On Priyanka Reddy Brutal Murder | Sakshi
Sakshi News home page

ప్రియాంకను హత్య చేసింది ఆ నలుగురే: సీపీ సజ్జనార్‌

Nov 29 2019 7:53 PM | Updated on Nov 29 2019 8:32 PM

CP Sajjanar Press Meet On Priyanka Reddy Brutal Murder - Sakshi

సాక్షి, శంషాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్య కేసు విషయాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియా ముందు వెల్లడించారు. ప్రియాంకారెడ్డిని పక్కా పథకం ప్రకారమే ట్రాప్‌ చేసి అత్యాచారం జరిపి, దారుణంగా హత్య చేశారని తెలిపారు. నిందితులు మహ్మద్‌ ఆరీఫ్‌ ఏ1 (26), శివ ఏ2 ( 20) నవీన్‌ ఏ3 (20) కేశవులు ఏ4 (20) కలిసి హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు సీపీ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో సీపీ వివరాలు వెల్లడిస్తూ.. ‘ప్రియాంక స్కూటీని టోల్‌ప్లాజా పక్కన పార్క్‌ చేయడం ఈ నలుగురు చూశారు. సాయంత్రం బైక్‌ తీసుకుపోవడానికి వస్తుందని మాటువేశారు. ఆమెపై ఎలానైనా అత్యాచారం జరపాలని పథకం రచించారు. శివ అనే వ్యక్తి దీనికి ప్రణాళికను రూపొందించారు. దానిలో భాగంగానే ఆమె ఎక్కడికీ వెళ్లకుండా ఉండాలని నవీన్‌ బైక్‌ పంక్చర్‌ చేశాడు.

ప్రియాంక బైక్‌ కోసం తిరిగి వచ్చేలోపు అప్పటికే నలుగురూ మద్యం సేవించి ఉన్నారు. స్కూటీ పంక్చర్‌ కావడంతో ఆమె ఒంటరిగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలోనే తొలుత ఆమె దగ్గరకు ఆరీఫ్‌ వచ్చి బైక్‌ తీసుకున్నాడు. పంక్చర్‌ చేయిస్తా అని బైక్‌ను తీసుకుని శివను పంపించాడు. అదే సమయంలో ప్రియాంక ఆమె సోదరికి ఫోన్‌ చేసి మాట్లాడింది. అప్పటికీ సమయం రాత్రి 9:30. శివ కేవలం గాలి మాత్రమే కొట్టించాడు. ఈ లోపు ఆరీఫ్‌, నవీన్‌, కేశవులు కలిసి ప్రియాంకను టోల్‌ప్లాజా పక్కనే ఉన్న.. నిర్మానుష్య ప్రాంతానికి బలవంతంగా లాక్కుని వెళ్లారు. ఆరీఫ్‌ ముక్కు, నోరు గట్టిగా నొక్కిపట్టాడు. ఈలోపు శివ కూడా వచ్చాడు. అనంతరం ఆమెపై అత్యాచారం జరిపి, హత్య చేశారు. బుధవారం రాత్రి 10: 08 గంటలకు ఆమె చనిపోయింది. ప్రియాంక శవాన్ని 10:30కి లారీలో తీసుకుని వెళ్లారు. మధ్యలో ఓ పెట్రోల్‌ బంక్‌ దగ్గర ఆగి బాటిల్‌లో పెట్రోల్‌ తీసుకున్నారు. తెల్లవారుజూమున 2:30 గంటలకు చటాన్‌పల్లి పెట్రోల్‌ పోసి దహనం చేశారు. రెండు గంటల తరువాత మరోసారి వచ్చి..శవం కాలిపోయిందా లేదా అనేది చూసుకున్నారు. అనంతరం వారంతా తిరిగి వెళ్లిపోయారు’ అని తెలిపారు.

ప్రియాంక కనిపించట్లేదని బుధవారం రాత్రి ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే 10 టీంలను ఏర్పాటు చేశాం. 24 గంటల్లో హత్య కేసును ఛేదించాం. నలుగురు అనుమానితులను అరెస్ట్‌ చేశాం. దీనిపై మరిన్ని వివరాలను సేకరిస్తున్నాం. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం’ అని తెలిపారు. 

ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు

అప్పుడు అభయ.. ఇప్పుడు !

నమ్మించి చంపేశారు!

ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు

భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement