ప్రాణం తీసిన కరోనా కంచె  | Coronavirus Lockdown Man Died Accidentally At Yellareddypet | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన కరోనా కంచె 

Mar 29 2020 8:16 AM | Updated on Mar 29 2020 9:07 AM

Coronavirus Lockdown Man Died Accidentally At Yellareddypet - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

గ్రామశివారులో అమ్ముకోవడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బండలింగంపల్లి నుంచి కొండాపూర్‌ వెళ్లే ప్రధాన రహదారిలో రోడ్డుకు అడ్డంగా చెట్ల కొమ్మలు, మొద్దులను వేశారు.

ఎల్లారెడ్డిపేట: కరోనా కట్టడికి గ్రామస్తులు వేసిన కంచె ఓ గీత కార్మికుడి ప్రాణాలను బలి తీసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన బాలనర్సాగౌడ్‌ (72) కల్లు గీసుకుని గ్రామశివారులో అమ్ముకోవడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బండలింగంపల్లి నుంచి కొండాపూర్‌ వెళ్లే ప్రధాన రహదారిలో రోడ్డుకు అడ్డంగా చెట్ల కొమ్మలు, మొద్దులను వేశారు. వాటిని దాటుతున్న క్రమంలో బండిపై నుంచి బాలనర్సాగౌడ్‌ కింద పడి మృతి చెందాడు. 

కల్లు దొరక్క ఇద్దరి ఆత్మహత్య
నిజామాబాద్‌ అర్బన్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో కల్లు దొరక్క కొంత మంది వింతగా ప్రవర్తిస్తున్నారు. నిజామాబాద్‌ నగరంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోగా, ఒకరు ఫిట్స్‌తో మృతి చెందారు. నగరంలోని సాయినగర్‌కు చెందిన శకుంతల (65) ప్రతిరోజూ కల్లు సేవించేది. వారం రోజులుగా కల్లు లేక పిచ్చిగా ప్రవర్తించింది. శుక్రవారం రాత్రి ఇంట్లో బాత్‌రూంలో ఉన్న ఫినాయిల్‌ తాగింది. ఆమె భర్త ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు ఎస్సై జాన్‌రెడ్డి తెలిపారు. అలాగే.. గాయత్రి నగర్‌కు చెందిన శంకర్‌ (45) శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ముదిరాజ్‌ వీధిలో నివాసం ఉండే భుషణ్‌ కల్లు లేక విచిత్రంగా ప్రవర్తిస్తుండటంతో పాటు ఫిట్స్‌ వచ్చి మృతి చెందాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement