breaking news
yellareddypet
-
కష్టాలున్నాయని కుమిలిపోలే..జీవిత పట్టా కుట్టుకుంది!
ఆమె తన కుల వృత్తి అయిన చెప్పులు కుడుతూనే... పుస్తకాలు పట్టుకుని జీవితంలోని చిరుగులను కుట్టుకుంది. అమ్మకు ఆసరాగా బీడీలు చుడుతూనే... తెలంగాణ యూనివర్సిటీ లో ఇంటిగ్రేటెడ్ కోర్సులతో డిగ్రీ, పీజీ చదివింది. విదార్థి నాయకురాలిగానూ అనేక ఉద్యమాల్లో పాల్గొంది. బీఈడీ అయ్యాక బీడీ కార్మికుల బతుకులపై పీహెచ్డీ చేసి ఇటీవల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా పట్టా అందుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆమే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన సిద్ధలక్ష్మి.కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మోచి వెంకటయ్య, నాగమణి దంపతులకు ఇద్దరు పిల్లలు. పిల్లలిద్దరు చిన్న వయసులో ఉన్నపుడే తండ్రి మరణించాడు. తల్లి నాగమణి ఓ వైపు బీడీలు చుడుతూ మరోవైపు చెప్పులు కుడుతూ పిల్లల్ని చదివించింది. కూతురు సిద్ధలక్ష్మి ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు, అక్కడే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. చదువుకునే సమయంలో సిద్దలక్ష్మి బీడీలు చుట్టడంతో పాటు కులవృత్తి కూడా చేసేది. పొద్దున, సాయంత్రం చెప్పుల దుకాణంలో తల్లితో పాటు కూర్చునేది. చెప్పులు కుట్టడం, అమ్మడంలో సాయపడేది. ఇంటర్ పూర్తయిన తరువాత తెలంగాణ యూనివర్సిటీలో ఐదేళ్ల డిగ్రీ, పీజీ (ఇంటిగ్రేటెడ్) కోర్సుకు సంబంధించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణురాలై సీటు సాధించింది. దీంతో యూనివర్సిటీలో అడుగుపెట్టిన సిద్ధలక్ష్మి చదువుకుంటూనే విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంది. పీడీఎస్‌యూ లో క్రియాశీలకంగా పనిచేసింది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలోనూ చురుకుగా పాల్గొంది.ఉద్యమాల్లోపాల్గొంటూనే సిద్ధలక్ష్మి డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. బీఈడీ చదువు కోసం మహబూబ్‌నగర్ వెళ్లింది. తరువాత ఉద్యమ సహచరుడు కన్నయ్యను వివాహమాడింది. ఆమెకు ముగ్గురు కుమారులు.బీడీ కార్మికుల బతుకులపై పరిశోధన...తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఆధారపడే బీడీ రంగంలో కార్మికుల ఆదాయం.. ఖర్చులు అన్న అంశంపై సిద్ధలక్ష్మి పరిశోధన పత్రం సమర్పించింది. ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకుంది. కాగా ఫెలోషిప్ ద్వారా తనకు నెలనెలా అందిన డబ్బులను పొదుపు చేసి ఎల్లారెడ్డిలో ఇల్లు నిర్మించుకుంది. బాన్సువాడలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేసింది. కష్టపడి పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా అందుకుంది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇదీ చదవండి: కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు! కష్టాలను దిగమింగానుమాది పేద కుటుంబం. అమ్మ ఎంతో కష్టపడి చదివించింది. మా మేనత్త చదువుకోమని ప్రోత్సహించింది. అమ్మకు ఆసరాగా చెప్పులు కుట్టడం, బీడీలు చుట్టడం చేస్తూనే చదువుకు కూడా సమయం కేటాయించేదాన్ని. యూనివర్సిటీలో చాలామంది ప్రోత్సహించారు. చిన్నప్పుడు బీడీ కార్మికుల కష్టాలను స్వయంగా చూశాను కాబట్టి బీడీ కార్మికులనే సబ్జెక్టుగా తీసుకుని పీహెచ్డీ చేశాను. డాక్టర్ పాత నాగరాజు సార్ నా పీహెచ్‌డీకి గైడ్‌గా ఎంతో ప్రోత్సహించి నా పరిశోధనకు సహకరించారు. కష్టాలున్నాయని కుమిలిపోతే ఇక్కడిదాకా రాకపోయేదాన్ని. కష్టాలను ఎదుర్కొనడంలోనే సక్సెస్ ఉంటుందని స్వయంగా తెలుసు కున్నాను. – డాక్టర్ సిద్ధలక్ష్మి, ఎల్లారెడ్డిఇదీ చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన– ఎస్.వేణుగోపాలాచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
తాటిచెట్టుపై విలవిల్లాడిన గీత కార్మికుడు.. ప్రాణాలకు తెగించి కాపాడి..
సాక్షి, ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): మండలంలోని దుమాలలో ఓ గీత కార్మికుడు కల్లు గీయడానికి బుధవారం తాటి చెట్టుపైకి ఎక్కి మోకు జారడంతో అక్కడే చిక్కుకొని రెండు గంటల పాటు విలవిల్లాడాడు. చివరికి మరో గీతకార్మికుడి సాహసంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దుమాల గ్రామానికి చెందిన ఆరేటి రాములు ఎప్పట్లాగే కల్లు గీసేందుకు బుధవారం ఉద యం తాటి చెట్టు ఎక్కాడు. కల్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి నడుంపైనున్న మోకు భుజాలపైకొచ్చింది. దీంతో పట్టు తప్పి చెట్టుపైనే తలకిందులుగా వేలాడ సాగాడు. సమీపంలోని తోటి గీత కార్మికుడు ఆరేటి పర్శరాములు ప్రాణాలకు తెగించి చెట్టు పైకెక్కాడు. రాములు భుజం వద్ద ఉన్న మోకు ను సరిచేసి నడుంకు కట్టి కిందకు దించాడు. రాములును కాపాడిన పర్శరాములును సర్పంచ్ కదిరె రజిత, మండల ఉపాధ్య క్షుడు కదిరె భాస్కర్, గ్రామస్తులు అభినందించారు. చదవండి: సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనలు.. ఐదు జిల్లాల్లో పర్యటన -
ఎల్లారెడ్డిపేటలో కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
-
ప్రాణం తీసిన కరోనా కంచె
ఎల్లారెడ్డిపేట: కరోనా కట్టడికి గ్రామస్తులు వేసిన కంచె ఓ గీత కార్మికుడి ప్రాణాలను బలి తీసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన బాలనర్సాగౌడ్ (72) కల్లు గీసుకుని గ్రామశివారులో అమ్ముకోవడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బండలింగంపల్లి నుంచి కొండాపూర్ వెళ్లే ప్రధాన రహదారిలో రోడ్డుకు అడ్డంగా చెట్ల కొమ్మలు, మొద్దులను వేశారు. వాటిని దాటుతున్న క్రమంలో బండిపై నుంచి బాలనర్సాగౌడ్ కింద పడి మృతి చెందాడు. కల్లు దొరక్క ఇద్దరి ఆత్మహత్య నిజామాబాద్ అర్బన్: లాక్డౌన్ నేపథ్యంలో కల్లు దొరక్క కొంత మంది వింతగా ప్రవర్తిస్తున్నారు. నిజామాబాద్ నగరంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోగా, ఒకరు ఫిట్స్‌తో మృతి చెందారు. నగరంలోని సాయినగర్‌కు చెందిన శకుంతల (65) ప్రతిరోజూ కల్లు సేవించేది. వారం రోజులుగా కల్లు లేక పిచ్చిగా ప్రవర్తించింది. శుక్రవారం రాత్రి ఇంట్లో బాత్రూంలో ఉన్న ఫినాయిల్ తాగింది. ఆమె భర్త ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు ఎస్సై జాన్‌రెడ్డి తెలిపారు. అలాగే.. గాయత్రి నగర్‌కు చెందిన శంకర్ (45) శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ముదిరాజ్ వీధిలో నివాసం ఉండే భుషణ్ కల్లు లేక విచిత్రంగా ప్రవర్తిస్తుండటంతో పాటు ఫిట్స్ వచ్చి మృతి చెందాడు. -
గల్ఫ్ గాయం.. సాగు భారం
ఎల్లారెడ్డిపేట: ఉన్న ఊరిలో ఉపాధి లేక అప్పులు చేసి గల్ఫ్ వెళ్లిన గిరిజన రైతుకు అక్కడ చుక్కెదురైంది. నమ్ముకున్న వ్యవసాయం నట్టేట ముంచింది. అప్పుల భారం అధిక మైంది. దీంతో మనస్తాపం చెందిన రైతు తాను నమ్ముకున్న పొలంలోనే చెట్టుకు ఉరేసుకోవడం అందరినీ కలిచివేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాశిగుట్ట తండాకు చెందిన రైతు మాలోతు గంగారాం(48) వ్యవసా యం కుంటుపడడంతో రూ.2 లక్షలు అప్పులు చేసి గల్ఫ్‌కు వెళ్లాడు. అక్కడ కంపెనీలో పనులు లేకపోవడంతో వెళ్లిన ఏడాదికి.. అప్పులు తీర్చకుండానే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామంలో మూడె కరాల్లో పత్తి, వరిపంటలు సాగు చేశాడు. ఇటీవల కురి సిన వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించలేదు. దీనికితోడు కుమార్తెల పెళ్లిళ్లు, కుమారుడి ఆపరేషన్ కోసం మరిన్ని అప్పులు చేశాడు. పంట దిగుబడి రాకపోవడం.. గల్ఫ్ వెళ్లడానికి చేసిన అప్పులు తీరకపోవడం, కుటుంబ పోషణ భారం కావడంతో కుంగి పోయిన గంగారాం పొలంలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. -
వేపపుల్ల అందుకోబోయి ఒకరి మృతి
ఎల్లారెడ్డిపేట : పళ్లు తోమడానికి వేపపుల్ల తెంపుకోబోయిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. ఎల్లారెడ్డిపేటకు చెందిన గుండాడి నర్సింహరెడ్డి(66) కుటుంబంతో కొంతకాలంగా హైదరాబాద్‌లోని కుకట్పల్లి హౌసింగ్‌బోర్డులో నివాసం ఉంటున్నాడు. అక్కడి యోగా కేంద్రానికి నర్సింహరెడ్డి ముఖ్య సలహాదారుడు, శిక్షకుడిగా పనిచేస్తున్నారు. తన ఇంటి సమీపంలోని ఓ పార్కులో నిత్యం వ్యాయామంతోపాటు యోగా చేస్తారు. రోజు లాగే మంగళవారం వ్యాయామం ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో ఓ వేపచెట్టు కొమ్మను తెంపడానికి ద్విచక్ర వాహనంపైకి ఎక్కాడు. కొమ్మ అందుకునే ప్రయత్నంలో అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నర్సింహరెడ్డి మృతదేహాన్ని ఎల్లారెడ్డిపేటకు తీసుకురాగా.. ఆయన అభిమానులు, బంధువులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. కేడీసీసీబీ వైస్ చైర్మన్ ఉచ్చిడి మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ తోట ఆగయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, వ్యాపారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుడికి భార్య రాధమ్మ, కుమారుడు మల్లారెడ్డి, కూతుళ్లు ఉన్నారు. -
గీతకార్మికుని ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేటలో గీతకార్మికుని ఆత్మహత్య ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. చేతికందిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు, ఆరునెలల కిందట వివాహామైన భార్య రోదనలు మిన్నంటాయి.« ఎల్లారెడ్డిపేటకు చెందిన నాగుల విజయ–పర్శరాములు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. ఏడాదిక్రితం పెద్ద కొడుకు శ్రీకాంత్ కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం రెండో కొడుకు శ్రీనివాస్ కూడా ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరునెలల క్రితమే గంభీరావుపేటకు చెందిన లతతో శ్రీనివాస్‌కు వివాహం జరిగింది. గీతకార్మికునిగా పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. తల్లి విజయ, భార్య లతను ఉదయం వ్యవసాయ పనులకోసం గ్రామశివారులో వాహనంపై దించి వచ్చిన శ్రీనివాస్ సాయంత్రం వరకూ శవంగా మారడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా తాను అప్పుల పాలయ్యానని, తన చావుకు ఎవ్వరూ కారణం కాదనీ, తల్లిదండ్రులతో పాటు భార్యకు అన్యాయం చేసి వెళ్తున్నానని లేఖలో పేర్కొన్నాడు. మృతుని తండ్రి పర్శరాములు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.