కరోనా మరణాలు @ 306

CoronaVirus: 1831 New Positive Cases Registered In Telangana - Sakshi

తాజాగా 11 మంది మృతి 

మరో 1,831 మందికి పాజిటివ్‌ 

25,733కి చేరిన కేసులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 300 దాటింది. సోమవారం కరోనాతో 11 మంది మృత్యువాతపడగా.. మొత్తం మరణించిన వారి సంఖ్య 306కు చేరింది. తాజాగా కరోనా పాజి టివ్‌ కేసులు మరో 1,831 నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 25,733కు చేరింది. ఇందులో 10,646 యాక్టివ్‌ కేసులుండగా.. 14,781 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 1,22,218 మందికి కరోనా పరీక్షలు నిర్వహిం చగా ఇందులో 96,485 మందికి నెగెటివ్‌ వచ్చింది.

మొత్తంగా 21.05% మందికి పాజిటివ్‌ వచ్చినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో అత్యధికంగా 1,419 మంది కరోనా బారినపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్‌ జిల్లాలో 117, ఖమ్మంలో 21, మెదక్, మంచిర్యాల జిల్లాల్లో 20 చొప్పున, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్‌ అర్బన్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో 9 చొప్పున, వికారాబాద్‌ జిల్లాలో 7, సూర్యాపేటలో 6, కరీంనగర్‌లో 5, జగిత్యాలలో 4, సంగారెడ్డిలో 3, గద్వాల, నారాయణపేట, యాదాద్రి, మహబూబా బాద్‌ జిల్లాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదైంది.

కోవిడ్‌ ఆస్పత్రుల్లో 1,340 బెడ్లు ఖాళీ...
కోవిడ్‌ చికిత్స కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రుల్లో 1,340 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. కోవిడ్‌–19 బాధితులకు చికిత్స అందించేందుకు గాంధీ ఆస్పత్రి, కింగ్‌ కోఠి ఆస్పత్రి, ఛాతీ ఆస్పత్రి, ఫీవర్‌ ఆస్పత్రులను నిర్దేశించారు. ఈ ఆస్పత్రుల్లో 2,501 బెడ్లు ఉండగా.. 1,161 బెడ్లు రోగులతో నిండిపోయాయి. ఇందులో ఇన్‌పేషెంట్లు 877 మంది ఉండగా, 284 బెడ్లు అనుమానితులతో నిండాయి. గాంధీ ఆస్పత్రిలో 1,058, కింగ్‌కోఠి ఆస్పత్రిలో 239, ఛాతీ ఆస్పత్రిలో 25, ఫీవర్‌ ఆస్పత్రిలో 18 బెడ్లు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

08-08-2020
Aug 08, 2020, 21:10 IST
సాక్షి, న్యూఢిల్లీ :  దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసులతో పాటు మృతుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది....
08-08-2020
Aug 08, 2020, 20:53 IST
సాక్షి, వికారాబాద్‌: తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జూబ్లీహిల్స్‌లోని...
08-08-2020
Aug 08, 2020, 18:46 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల జోరు కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 62,123 మందికి కరోనా...
08-08-2020
Aug 08, 2020, 16:26 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలలంగాణలో రోజుకు 23వేల మందికి కరోనా టెస్టులు చేస్తున్నామని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు....
08-08-2020
Aug 08, 2020, 15:54 IST
ఆరు సార్లు లోక్‌సభ, రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిథ్యం వహించిన నంది ఎల్లయ్య వివాదాలకు దూరంగా ఉండే నేతగా పేరు గడించారు.
08-08-2020
Aug 08, 2020, 15:35 IST
ముంబై: ఇటీవల కరోనా బారిన పడిని బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ మహమ్మారిని జయించాడు. గత కొంతకాలంగా కరోనాతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఆయన‌ చికిత్స తీసుకుంటున్న...
08-08-2020
Aug 08, 2020, 14:18 IST
ఆదిలాబాద్‌టౌన్‌: చనిపోయిన వారికి సాంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడం ఆనవాయితీ.. ఏ కులం, ఏ మతంలోనైనా వారి సాంప్రదాయం...
08-08-2020
Aug 08, 2020, 13:35 IST
సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. ఆయన...
08-08-2020
Aug 08, 2020, 12:40 IST
మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(78) కన్నుమూశారు.
08-08-2020
Aug 08, 2020, 11:05 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా...
08-08-2020
Aug 08, 2020, 10:19 IST
రాజమహేంద్రరం క్రైం: పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 252 మందికి ఖైదీలకు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌లోనే చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు...
08-08-2020
Aug 08, 2020, 10:02 IST
మహాముత్తారం : ప్రపంచమంతా కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో చికెన్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. లాక్‌డౌన్‌ సమయంలో చికెన్‌ తింటే...
08-08-2020
Aug 08, 2020, 09:16 IST
కరోనా వైరస్‌ కమ్యూనిటీ దశలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. గుంపులు గుంపులుగా కాకుండా భౌతిక...
08-08-2020
Aug 08, 2020, 08:55 IST
హైదరాబాద్‌: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా పలు వైరస్‌లకు సంబంధించిన  వ్యాక్సిన్ల అభివృద్ధిలో నిమగ్నమైంది. ఇందులో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌...
08-08-2020
Aug 08, 2020, 08:41 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరగుతున్నాయి.. వరుసగా మూడో రోజు 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి....
08-08-2020
Aug 08, 2020, 08:39 IST
సాక్షి, హైదరాబాద్‌: విశ్వనగరంపై కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం 80 శాతం మందిలోఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు కానీ.. పరీక్షల్లో...
08-08-2020
Aug 08, 2020, 07:18 IST
చెన్నేకొత్తపల్లి: ఇష్టం లేని పెళ్లిని తప్పించుకునేందుకు ఓ యువకుడు తనకు కరోనా సోకిందంటూ ప్రచారం చేసుకున్నాడు. క్వారంటైన్‌లో ఉన్నానంటూ బంధువులకు...
08-08-2020
Aug 08, 2020, 05:09 IST
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో ఆస్పత్రుల నుంచి 7,594 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కరోనా నుంచి...
08-08-2020
Aug 08, 2020, 04:00 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో వైద్యం, ఇతర సంబంధిత సేవల కోసం 11,200 మంది సిబ్బందిని నియమిస్తున్నామని సీఎం...
08-08-2020
Aug 08, 2020, 03:52 IST
సామాజిక ఆసుపత్రుల్లో కూడా ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top