ఇండోనేషియన్లు ఇక్కడే తిరిగారట! | Corona Case Positive Case: Indonesians In Railway Station CC Footage | Sakshi
Sakshi News home page

కరోనా బారిన పడింది వీరే..

Mar 20 2020 8:05 AM | Updated on Mar 20 2020 12:37 PM

Corona Case Positive Case: Indonesians In Railway Station CC Footage - Sakshi

స్టేషన్‌ ఎదుట ఇండోనేషియన్లు 

సాక్షి, రామగుండం(కరీంనగర్‌): ఇండోనేషియన్లు తిరిగన ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నా రు. కరోనా వైరస్‌ బారిన పడిన ఇండోనేషియన్లు ఈ నెల 14న ఏపీ సంపర్క్‌క్రాంతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ నుంచి రామగుండంకు వచ్చిన విషయం తెలిసిందే. వారంతా గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సదరు ఇండోనేషియన్లు రైలు దిగి బయట రోడ్డుపై ఉన్న ఆటోస్టాండు వద్దకు బ్యాగులతో వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే రైల్వేశాఖ రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంతో వారు ఎవరెవరినీ కలిశారన్న సమాచారం లభించడం లేదు. ఇప్పటికైన రైల్వేశాఖ స్పందించి రైల్వే ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

కరోనా మరణాల్లో చైనాను మించిన ఇటలీ

పర్యటనపై ఆరా..
వేములవాడ: వేములవాడలోని సుభాష్‌నగర్‌ మజీద్‌కు ఈ నెల 7, 8 తేదీల్లో ఇండినేషియాకు చెందిన 12 మంది బృంద సభ్యులు పర్యటించిన అంశంపై కలెక్టర్, ఎస్పీ, స్థానిక పోలీసులు గురువారం ఆరా తీశారు. కరీంనగర్‌లో ఇండోనేషియా బృందం పర్యటన సందర్భంగా మూడు మజీద్‌లు, ఆయా ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రమంలో వేములవాడలోనూ మరో ఇండోనేషియా బృందం పర్యటించి వెళ్లిన అంశంపై అధికారులు ఆరా తీశారు. ఎవరెవరు వచ్చారు..? ఏయే ప్రాంతాల్లో పర్యటించారన్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement