గిట్టుబాటు ధర కోసం ధర్నా | congress leaders dharna for mirchi faircost | Sakshi
Sakshi News home page

గిట్టుబాటు ధర కోసం ధర్నా

Apr 3 2017 4:34 PM | Updated on Mar 18 2019 8:51 PM

మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కాంగ్రెస్‌ నేతలు ధర్నా చేపట్టారు.

హైదరాబాద్‌: మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కాంగ్రెస్‌ నేతలు ధర్నా చేపట్టారు. టీపీసీసీ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ఆధ్వర్యంలో మలక్‌పేటలోని గంజ్ మార్కెట్‌లో మిర్చి రైతుల కష్టాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం వారికి ఇస్తున్న మద్దతుధరపై ఆరా తీశారు. గిట్టుబట్టు ధర కల్పించేదాకా తాము మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ధర్నా అనంతరం చీఫ్ సెక్రటరీ ఎస్.పి.సింగ్ కు విజ్ఞాపన పత్రం అందజేశారు. పండించిన పంటను నిల్వ ఉంచుకోవటానికి కోల్డ్‌స్టోరేజీలను ఏర్పాటు చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement