సోనియా గాంధీ విలవిలలాడుతోంది : భట్టి విక్రమార్క | Congress Leader Bhatti Vikramarka Fires On TRS Party | Sakshi
Sakshi News home page

సోనియా గాంధీ విలవిలలాడుతోంది : భట్టి విక్రమార్క

Sep 21 2018 12:59 PM | Updated on Mar 18 2019 7:55 PM

Congress Leader Bhatti Vikramarka Fires On TRS Party - Sakshi

కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క

ప్రభుత్వ చర్యల వల్ల రైతులు అధోగతి పాలు అయ్యారని, ఏ ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నామో అది లేకుండా పోయిందని ఆవేదన..

సాక్షి, ఖమ్మం : సోనియా గాంధీ ఏ లక్ష్యం కోసం తెలంగాణ ఇచ్చిందో ఆ లక్ష్యం నెరవేరకపోవటంతో ఆమె విలవిలలాడుతోందని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ చర్యల వల్ల రైతులు అధోగతి పాలు అయ్యారని, ఏ ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నామో అది లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచార స్ట్రాటజీ పేపర్‌ ముసాయిదాను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అణగారిన, బలహీన వర్గాల ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కోసం పోరాటం సాగుతోందని వ్యాఖ్యానించారు.

రీ డిజైనింగ్‌ వల్ల గోదావరి నుంచి ఒక్కచుక్క నీరు కూడా రాకుండా పోయిందని అన్నారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఫ్యూడల్‌ ప్రభుత్వాన్ని దించి ప్రజల అజెండానే మా అజెండాగా.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఎన్నికలను సామాన్య, మధ్య తరగతుల ప్రజలకు.. ఫ్యూడల్స్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీడియా మీద కూడా ఆంక్షలు విధించిందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement