'తోటపల్లి రిజర్వాయర్ ను నిర్మించాలి' | Congress Dharna about Thotapalli Reservoir | Sakshi
Sakshi News home page

'తోటపల్లి రిజర్వాయర్ ను నిర్మించాలి'

Aug 24 2015 2:01 PM | Updated on Mar 18 2019 7:55 PM

కరీంనగర్ జిల్లాలోని తోటపల్లి రిజర్వాయర్‌ను నిర్మించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కటకం మృత్యంజయం, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు నిరసన దీక్షకు దిగారు.

కమలాపురం: కరీంనగర్ జిల్లాలోని తోటపల్లి రిజర్వాయర్‌ను నిర్మించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కటకం మృత్యంజయం, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు నిరసన దీక్షకు దిగారు. వీరు ఆదివారం అర్ధరాత్రి చిగరుమామిడి మండలంలో నిరసన దీక్షకు దిగారు.

దీంతో పోలీసులు వీరిని అర్ధరాత్రే అరెస్ట్ చేసి కమలాపురం పీఎస్‌కు తరలించారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే తోటపల్లి రిజర్వాయర్‌ను నిర్మించడంలేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లాలో దత్తత తీసుకున్న చిగురుమామిడి మండలం చిన్నమల్కనూరు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement