
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
మారుతున్న కాలానికి అనుగుణంగా అవసరమైన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని తమ సంస్థ ద్వారా నిరుపేదలకు అందించేందుకు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని వీటిని సద్వినియోగం చేసుకొవాలని సాయి ఓరల్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఏఎస్ నారాయణ కోరారు.
మునుగోడు, న్యూస్‌లైన్ : మారుతున్న కాలానికి అనుగుణంగా అవసరమైన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని తమ సంస్థ ద్వారా నిరుపేదలకు అందించేందుకు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని వీటిని సద్వినియోగం చేసుకొవాలని సాయి ఓరల్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఏఎస్ నారాయణ కోరారు.
పది రోజుల క్రితం స్థానిక ప్రాథమిక పాఠశాలలో సంస్థ ద్వారా ఏర్పాటుచేసిన కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. కేంద్రంలో శిక్షణ పొందుతున్న వారిని పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదకుటుంబాలకు చెందిన యువతకు తమ సంస్థ ద్వారా సాయం అందిస్తామన్నారు. ఆయన వెంట శిక్షణ శిబిరం నిర్వాహకుడు హరిప్రసాద్, ఇన్‌స్ట్రక్టర్ వనజ తదితరులు ఉన్నారు.