కేసీఆర్‌పై హెచ్చార్సీలో ఫిర్యాదు

Complaint on kcr at hrc - Sakshi

వనపర్తి సభలో దివ్యాంగులను కేసీఆర్‌ కించపరిచారని ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఇటీవల వనపర్తిలో జరిగిన బహిరంగ సభలో దివ్యాంగులను ఉద్దేశించి కుంటోళ్లు, గుడ్డోళ్లు అంటూ కేసీఆర్‌ వ్యాఖ్యానించారని, ఇలా మాట్లాడటం వారి ని కించపరచడమేనంటూ టీపీసీసీ దివ్యాంగుల విభాగం హెచ్చార్సీని ఆశ్రయించింది. ఈ మేరకు టీపీసీసీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ముత్తినేని వీరయ్య వర్మ మంగళవారం మీడియాకు వెల్లడించారు.

అదేవిధంగా దివ్యాంగుల చట్టం 2016లో పేర్కొన్న 14 రకాల వైకల్యాల్ని గుర్తించకపోవటం వల్ల లక్షలమంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగ సమయంలో ఎన్నికల సంఘం కల్పించే సదుపాయాలను కోల్పోతున్నారని, ఇది దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనే అవుతుందన్నారు. ఈ అంశాన్ని పరిష్కరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మరో ఫిర్యాదు కూడా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. హెచ్చార్సీని ఆశ్రయించిన వారిలో దివ్యాంగుల విభాగం నగర అధ్యక్షుడు సతీశ్‌గౌడ్‌ కూడా ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top