ప్రజల కోసమే రాజకీయాల్లోకి..

Coming To Politics With Peoples - Sakshi

కౌటాల : నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు పరిష్కారించేందుకే తాను రాజకీయాలోకి వచ్చానని మాజీ ఎమ్మెల్యే పీపీరావు తనయుడు, ప్రజా నాయకుడు పాల్వాయి హరిశ్‌బాబు స్పష్టం చేశారు. మంగళవారం  మండలంలోని నాగేపల్లి, గిన్నెలహెట్టి, కౌటాల గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిన్నెలహెట్టి గ్రామంలోని హనుమాన్‌ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, గ్రామంలో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని గ్రామస్తులు ఆయనకు తమ సమస్యలు తెలిపారు. సమస్యలు విన్న హరిశ్‌బాబు నాగేపల్లి, గిన్నెలహెట్టి గ్రామాల్లోని సమస్యల పరిష్కారించడానికి కృషి చేస్తాన్నాని మాటిచ్చారు. తాను అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాన్నని తెలిపారు. ఆనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆర్యోగ కేంద్రాన్ని సందర్శించిన ఆయ. అక్కడ అందిస్తున్న వైద్య సేవలను స్థానిక వైద్యుడు కృష్ణప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి పేదప్రజలు వస్తారిని, వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కార్యక్రమంలో మండల నాయకులు ఎల్ములే మల్లయ్య, చదువుల శ్రీనివాస్, దుర్గం మోతిరాం, బావుజీ,  కుంచాల విజయ్, జ్యోతిరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top