కొత్త జిల్లాలకు కలెక్టర్ల నియామకం | Collectors Appointed For Mulugu And Narayanpet District | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాలకు కలెక్టర్ల నియామకం

Feb 27 2019 3:57 PM | Updated on Feb 17 2020 5:11 PM

Collectors Appointed For Mulugu And Narayanpet District - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవల కొత్తగా ఏర్పడిన ములుగు, నారాయణపేట జిల్లాలకు పూర్తిస్థాయి కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు జిల్లా కలెక్టర్‌గా సి. నారాయణరెడ్డి, నారాయణపేట్‌ జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.వెంకట్రావును నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన బీ జనార్థన్‌ రెడ్డి విద్యాశాఖ కార్యదర్శిగా, మస్రద్‌ఖాన్‌ అయేషా వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

వెంకట్రావ్‌ ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్తజిల్లాల ఏర్పాటుతో ఆయన జిల్లా పాలనాధికారిగా నియమితులైనారు. కాగా సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటుచేస్తామని ఇచ్చిన హామీ మేరకు రెండు నూతన జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 
 

Advertisement
 
Advertisement
Advertisement