
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బేగంపేట ఫ్లైఓవర్‌పై ఓ నాగుపాము హల్‌చల్ చేసింది. బుసలు కొడుతూ ఫ్లైఓవర్ పైకి రావడంతో ఎక్కటి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. మొదటగా రోడ్డు పక్కన ఉన్న పూలకుండిలో పామును గమనించిన ప్రయాణీకులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు, యువకులు పామును పట్టుకునేందుకు ప్రయత్నించడంతో అది రోడ్డుపైకి వచ్చింది. పామును చూసిన వాహనదారులు భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. కాసేపటి తర్వాత ఓ యువకుడు పామును పట్టుకొని పొదల్లో విడిచిపెట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, పాము హల్‌చల్ కారణంగా ఫ్లైఓవర్‌కు ఇరువైపుల భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.