రేపటి నుంచి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పర్యటన | CM KCR Khammam Tour on Tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పర్యటన

Feb 14 2016 6:34 PM | Updated on Aug 15 2018 9:30 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రేపటి నుంచి రెండు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రేపటి నుంచి రెండు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ýసోమవారం ఉదయం 11 గంటలకు కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఖమ్మం బయల్దేరి వెళతారు. ముందుగా ఆయన ఖమ్మం నగరంలో అధికారులతో సమీక్ష
నిర్వహించనున్నారు.

రెండో రోజు మంగళవారం రోడ్డు మార్గంలో కేసీఆర్ ముదిగొండ చేరుకుని అక్కడ నుంచి ముత్తారం గ్రామంలోని రామాలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం తిరుమలాయపాలెంలో  రామదాసు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి బహరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం టేకులపల్లి మండలం రోళ్లపాడులో శ్రీరామ నీటి పథకానికి శంకుస్థాపన చేసి అక్కడ ప్రజలతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు రోళ్లపాడు నుంచి కేసీఆర్ హైదరాబాద్ పయనం అవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement