సివిల్‌ టాపర్‌కి సీఎం కేసీఆర్‌ ఆహ్వానం | CM KCR Invites Civil topper Anudeep to launch | Sakshi
Sakshi News home page

May 6 2018 6:07 PM | Updated on Aug 15 2018 9:06 PM

CM KCR Invites Civil topper Anudeep to launch - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిష్టాత్మకమైన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించిన దురిశెట్టి అనుదీప్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నుంచి పిలుపు అందింది. అనుదీప్‌, ఆయన తల్లిదండ్రులను సోమవారం ప్రగతి భవన్‌కు రావాలని సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు. వారితో కలిసి సీఎం భోజనం చేయనున్నారు. ఇటీవల వెలువడిన సివిల్‌ 2017 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సివిల్స్‌ సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. సివిల్స్‌ మొదటి ర్యాంకు సాధించిన అనుదీప్‌ది జగిత్యాల జిల్లా మెట్‌పల్లి.

Advertisement
 
Advertisement
Advertisement