రైతుల అభివృద్ధే కేసీఆర్‌ ధ్యేయం | CM KCR Govt Is Good MLA Kusukuntla | Sakshi
Sakshi News home page

రైతుల అభివృద్ధే కేసీఆర్‌ ధ్యేయం

May 4 2018 7:20 AM | Updated on Oct 1 2018 2:19 PM

CM KCR Govt Is Good MLA Kusukuntla - Sakshi

ట్రాక్టర్లను అందజేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి

చండూరు : రైతుల అబివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్యేయమని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నాంపల్లి, చండూరు, మర్రిగూడెం మండలాలకు చెందిన 50 మందికి సబ్సీడీ ట్రాక్టర్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంటామనే మాట నేటికీ తప్పలేదన్నారు. రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సబ్సీడీపై ట్రాక్టర్లను అందిస్తున్నామన్నారు. రైతులు సబ్సీడీని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రైతులకు దళారి వ్యవస్థ ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసి రైతు పండించిన ధాన్యానికి ధర వారే నిర్ణయించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అధికారులను సమాయత్తం చేస్తున్నామన్నారు. అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయన్నారు. రానున్న కాలంలో మునుగోడును మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తోకల వెంకన్న, ఎంపీడీఓ శైలజ, తహసీల్దార్‌ మహేందర్‌ రెడ్డి, ఏడీఏ నాగమణి, ఏఓలు మల్లేశం, రెతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ బొమ్మరబోయిన వెంకన్న, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకన్న, కోడి వెంకన్న పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement