బాల్‌రాజ్.. అంతా బాగుందా.. | CM inquires on developments erravalli | Sakshi
Sakshi News home page

బాల్‌రాజ్.. అంతా బాగుందా..

Sep 5 2015 2:11 AM | Updated on Jul 11 2019 7:45 PM

బాల్‌రాజ్.. అంతా బాగుందా.. - Sakshi

బాల్‌రాజ్.. అంతా బాగుందా..

‘ఏమి బాల్‌రాజు.. అంతా సెట్‌రైట్ అయిందా.. పనులెట్లా సాగుతున్నాయ్..’ అంటూ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు

ఎర్రవల్లి ఆభివృద్ధి పనులపై సీఎం ఆరా

 జగదేవ్‌పూర్: ‘ఏమి బాల్‌రాజు.. అంతా సెట్‌రైట్ అయిందా.. పనులెట్లా సాగుతున్నాయ్..’ అంటూ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు శుక్రవారంరాత్రి ఫాంహౌస్‌కు వెళుతూ మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో సర్పంచ్ భర్త టీఆర్‌ఎస్ నేత బాల్‌రాజును పలకరించారు. కేసీఆర్ ఫాంహౌస్ వస్తున్నారని సమాచారం ఉండడంతో బాల్‌రాజుతోపాటు మరో ఐదుగురు నాయకులు రోడ్డు పక్కన పాఠశాల దగ్గర వేచి ఉన్నారు.

ఎర్రవల్లికి చేరుకుగానే వారిని చూసి సీఎం కాన్వాయ్ ఆపి ఇలా పలకరించారు.  ఈ నెల 8న చైనా పర్యటనకు వెళ్లుతున్న క్రమంలో ఓ సారి వ్యవసాయక్షేత్రంలో వ్యవసాయ పనులను పరిశీలించేందుకు  సీఎం వచ్చినట్లు తెలుస్తోంది. శనివారం ఫాంహౌస్‌లోనే ఉండి, ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement