‘ఎర్రవల్లి’పై సీఎం ఆరా | CM focus on erravalli | Sakshi
Sakshi News home page

‘ఎర్రవల్లి’పై సీఎం ఆరా

Aug 27 2015 11:40 PM | Updated on Jul 11 2019 7:45 PM

‘ఎర్రవల్లి’పై సీఎం ఆరా - Sakshi

‘ఎర్రవల్లి’పై సీఎం ఆరా

సీఎం కేసీఆర్ గురువారం రాత్రి తన ఫాంహౌస్‌కు వస్తూనే ఎర్రవల్లి పనులపై ఆరా తీసినట్టు తెలిసింది...

జగదేవ్‌పూర్: సీఎం కేసీఆర్ గురువారం రాత్రి తన ఫాంహౌస్‌కు వస్తూనే ఎర్రవల్లి పనులపై ఆరా తీసినట్టు తెలిసింది. గ్రామజ్యోతిలో భాగంగా ఆయన తన గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గ్రామంలో రెండ్రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న పనులపై ఆయన ఆరా తీశారని సమాచారం. కాగా, గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో సీఎం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఆదివారం వరకు ఇక్కడే ఉంటారని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement