ఆంధ్రావాళ్లు ఇంకా ఇక్కడేంటి... | Clashes in Telangana PCC Meeting in gandhi bhavan | Sakshi
Sakshi News home page

ఆంధ్రావాళ్లు ఇంకా ఇక్కడేంటి...

Jul 17 2014 12:46 PM | Updated on Aug 11 2018 7:11 PM

ఆంధ్రావాళ్లు ఇంకా ఇక్కడేంటి... - Sakshi

ఆంధ్రావాళ్లు ఇంకా ఇక్కడేంటి...

పార్టీలో విభేదాలు లేవని సీఎల్పీ నేత జానారెడ్డి చెప్పిన 24 గంటలు గడవక ముందే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీభవన్ సాక్షిగా కొట్లాటకు దిగారు.

హైదరాబాద్ :  పార్టీలో విభేదాలు లేవని  సీఎల్పీ నేత  జానారెడ్డి చెప్పిన 24 గంటలు గడవక ముందే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు  గాంధీభవన్ సాక్షిగా నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు . దాంతో తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం రసాభాసగా మారింది. ఆహ్వాన జాబితాలో తమ పేర్లు లేవంటూ కొందరు పార్టీ సీనియర్ నేతలు వాగ్వివాదానికి దిగారు. రాష్ట్రం విడిపోయినా సీమాంధ్ర నేతల్ని ఇంకా తెలంగాణలోనే ఎలా కొనసాగిస్తారంటూ టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను నిలదీశారు. తెలంగాణ పీసీసీ కార్యవర్గ జాబితాలో ఉన్న సీమాంధ్ర నేతల పేర్లు తొలగించాలని డిమాండ్ చేశారు.

కనీసం తమను సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సభ్యుల మధ్య జరిగిన తీవ్ర వాగ్వివాదం చివరకు తోపులాటకు దారి తీసింది. మరోవైపు మాజీమంత్రి, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా టీపీసీసీ సమాచారం తనకు అందలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాచారం ఇస్తే బాగుండేదని ఆయన అన్నారు. కాగా ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ పీసీసీ చీప్ డీ శ్రీనివాస్, జానారెడ్డి ఈ వ్యవహారంపై అంటీ ముట్టనట్లు ఉండటం విశేషం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement