కొట్టుకున్న చిరంజీవి అభిమాన సంఘం నేతలు | clashes between chiranjeevi fans asossiation leaders in karimnagar district | Sakshi
Sakshi News home page

కొట్టుకున్న చిరంజీవి అభిమాన సంఘం నేతలు

Apr 5 2015 7:12 PM | Updated on Jul 25 2018 3:28 PM

కొట్టుకున్న చిరంజీవి అభిమాన సంఘం నేతలు - Sakshi

కొట్టుకున్న చిరంజీవి అభిమాన సంఘం నేతలు

చిరంజీవి అభిమాన సంఘం నేతల విభేదాలు కొట్లాటకు దారితీశాయి.

కరీంనగర్: చిరంజీవి అభిమాన సంఘం నేతల విభేదాలు కొట్లాటకు దారితీశాయి. దీనిపై పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం వెంకట్రావుపల్లిలో ఆదివారం చిరంజీవి అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమానికి సంఘం రెండు రాష్ట్రాల అధ్యక్షులు కరాటే ప్రభాకర్, స్వామి నాయుడు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జరిగిన విందు అనంతరం నాయకులంతా సాయంత్రం 5 గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. గ్రామం సమీపంలోని రైల్వేగేట్ సమీపంలో గోదావరిఖనికి చెందిన సంఘం నేత రాము, అతని అనుచరులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కరాటే ప్రభాకర్‌పై దాడికి దిగారు. దీనిపై ప్రభాకర్ ఫిర్యాదు మేరకు పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనపై సినీ నటుడు చిరంజీవికి కూడా సమాచారం అందించినట్లు నాయకులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement