చొప్పదండి: దొంగల కూటమిని నమ్మకండి

Choppadandi TRS MLA candidate Slams On Grand Alliance - Sakshi

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రవిశంకర్‌ 

సాక్షి, కొడిమ్యాల: కేసీఆర్‌ను ఓడించడం లక్ష్యంగా ఏర్పడ్డ ప్రజాకూటమి దోపిడీ దొంగల కూటమిని చొప్పదండి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్‌ అన్నారు. కొడిమ్యాల మండల కేంద్రంతో పాటు నమిలికొండ, శ్రీరాములపల్లి, గోపాల్‌రావుపేట, ఆరెపల్లి, పూడూరు, అప్పారావుపేట, రామారావుపేట, చింతలపల్లి గ్రామాలలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత పాలకులు 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని నాలుగున్నరేళ్లలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందని తెలిపారు. మళ్లీ మోసపోయి కాంగ్రెస్, టీడీపీలకు ఓటువేస్తే అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. జగిత్యాల సభ నుంచి కరీంనగర్‌ సభకు కేసీఆర్‌ హెలిక్యాప్టర్‌లో తనను వెంట తీసుకెల్లినప్పటికీ.. మాజీ ఎమ్మెల్యే శోభ కేసీఆర్‌ ప్రసంగంలో తన పేరు కూడా  ప్రస్తావించలేదని అనడం హాస్యాస్పదమన్నారు. మండలంలోని మైసమ్మచెరువు, పోతారం పెద్దచెరువు రిజర్వాయర్‌లను ఎల్లంపల్లి నీటితో నింపి ఈప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామన్నారు. ఎంపీపీమేన్నేని స్వర్ణలత, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, విండోచైర్మన్‌ పునుగోటి కృష్ణారావు, నాయకులు మేన్నేని రాజనర్సింగరావు, ఎంపీటీసీలు నాగరాజు, చంద్రశేఖర్, బల్కంమల్లేశం, కోఆప్షన్‌మెంబర్‌ చాంద్‌పాషా, ఆదయ్య, హన్మయ్య, లింగాగౌడ్, చంద్రమోహన్‌రెడ్డి,  బైరివెంకటి, బింగిమనోజ్, కొత్తూరిస్వామి, శివప్రసాద్‌రెడ్డి, మొగిలిపాలెం శ్రీనివాస్, పులి వెంకటేష్, నసీర్‌ పాల్గొన్నారు.  

ఇంటింటా ప్రచారం...
మల్యాల: మండల కేంద్రంతో పాటు, ఒబులాపూర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు ఇంటింటా ప్రచారం ముమ్మరం చేశారు. ఒబులాపూర్‌లో ఎండీ.సుభాన్, అనిల్‌రెడ్డి, మండల కేంద్రంలో మైనార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. బూసి గంగాధర్, పొన్నం మల్లేశం గౌడ్, అమీర్, పందిరి శేఖర్, లాలా మహమ్మద్, నూర్‌ మహమ్మద్, సలీం, మాజీద్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top