ఉత్తమ నాయకులను ఎన్నుకోవాలి | choose best leaders | Sakshi
Sakshi News home page

ఉత్తమ నాయకులను ఎన్నుకోవాలి

Mar 16 2014 4:39 AM | Updated on Sep 2 2017 4:45 AM

ఉత్తమ నాయకులను ఎన్నుకోవాలి

ఉత్తమ నాయకులను ఎన్నుకోవాలి

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుహక్కు ద్వారా ఉత్తమ నాయకులను ఎన్నుకోవాలని వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కాంతారావు సూచించారు.

మామునూరు, న్యూస్‌లైన్ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుహక్కు ద్వారా ఉత్తమ నాయకులను ఎన్నుకోవాలని వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కాంతారావు సూచించారు. మామునూరు పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంతో పాటు తిమ్మాపురంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన వేర్వేరుగా మాట్లాడారు.

 

ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్య లు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో గ్రామ పోలీసింగ్ సిస్టమ్ పకడ్బందీగా అమలుచేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఇప్పటికే వాల్‌రైటింగ్ చెరిపి స్తూ పార్టీల గద్దెలు తొలగిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా అన్ని ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా రౌడీషీటర్లను బైండోవర్ చేసి వారిలో మార్పు తీసుకొచ్చేందుకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని డీఐజీ తెలిపా రు.

 

మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తో పాటు సార్వత్రిక ఎన్నికలు ఒకే సమయం లో జరగనున్నందున పోలీసు సిబ్బంది సరిపోకపోతే ఎక్సైజ్, ఫారెస్ట్, అగ్నిమాపక సిబ్బంది సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. కాగా, నక్సల్స్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామ ని చెప్పి ప్రజాస్వామ్యానికి విరుద్ధం గా వ్యవహరిస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని డీఐజీ ప్రజలను కోరారు.

 

ఈ సందర్భంగా తిమ్మాపురంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడమే కాకుండా అక్కడి ఓటర్లతో ప్రతిజ్ఞ చే యించా రు. కార్యక్రమంలో మామునూరు డీఎస్పీ సురేష్‌కుమార్, సీఐలు వెంకటేశ్వర్‌రెడ్డి, సదయ్య, ఎస్సై దీపక్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు పి.సదానందం, జె.రంజిత్, చింత ప్రకాష్, షకీల్‌అహ్మద్, మేకల సూరయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement