టీవీ ఆన్‌చేస్తుండగా షాక్‌.. బాలుడి మృతి | child dies in short circuit.. | Sakshi
Sakshi News home page

టీవీ ఆన్‌చేస్తుండగా షాక్‌.. బాలుడి మృతి

Apr 4 2017 9:53 PM | Updated on Apr 3 2019 8:07 PM

విద్యుత్‌ షాక్‌తో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన బంట్వారం మండలం నాగసాన్‌పల్లి తాండా సమీపంలో జరిగింది.

బంట్వారం: విద్యుత్‌ షాక్‌తో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన బంట్వారం మండలం నాగసాన్‌పల్లి తాండా సమీపంలోని ఎల్లమ్మ గుట్ట వద్ద మంగళవారం జరిగింది. తండాకు చెందిన మాణిబాయి ఎల్లమ్మ దేవాలయం వద్ద పూజారిగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నది. ఆమె  అన్న కుమారుడు పరశురాం(6) మాణిబాయి వద్ద ఉంటూ వికారాబాద్‌ కృష్ణవేణి స్కూల్లో పస్ట్‌ క్లాస్‌ చదువుతున్నాడు. మంగళవారం బడి నుంచి ఎల్లం గుట్టకు తిరిగి వచ్చాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో టీవీ ఆన్‌ చేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. మేనత్త మాణిబాయి వెంటనే వికారాబాద్‌ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గంమధ్యలో మరణించాడు. బాలుడికి తల్లిదండ్రులు సుమ్మిబాయి, శంకర్‌, ఒక సోదరి ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement