గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ | Chief KCR meeting with Governor | Sakshi
Sakshi News home page

గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ

Dec 6 2016 3:41 AM | Updated on Aug 15 2018 9:37 PM

గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ - Sakshi

గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ

రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం భేటీ అయ్యారు.

అసెంబ్లీ సమావేశాలు, నగదురహిత లావాదేవీలపై చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం భేటీ అయ్యారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. 14వ తేదీ తర్వాత అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందుకు సంబంధించిన షెడ్యూలును ఒకటీరెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. సమావేశాల షెడ్యూలుకు ముందుగా గవర్నర్ అనుమతితో నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు గత నెలలో కేంద్రం ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలు, రాష్ట్రంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు చేపడుతున్న చర్యలపై గవర్నర్‌తో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement