శివాజీ సేవలు చిరస్మరణీయం | chatrapati Shivaji services are memorable says godam nagesh | Sakshi
Sakshi News home page

శివాజీ సేవలు చిరస్మరణీయం

Feb 20 2018 2:46 PM | Updated on Aug 15 2018 9:04 PM

chatrapati Shivaji services are memorable says godam nagesh - Sakshi

నివాళులర్పిస్తున్న ఎంపీ నగేష్‌

ఇచ్చోడ(బోథ్‌): దేశం కోసం ప్రాణాలర్పించిన ఛత్రపతి శివాజీ సేవలు చిరస్మరణీయమని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. శివాజీ జయంతి సందర్భంగా మండలకేంద్రంలోని శివాజీ విగ్రహానికి సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి వచ్చే శివాజీ జయం తి నాటికి ప్రభుత్వ సెలవు దినం కోసం కృషి చేస్తానని తెలిపారు.

కార్యక్రమంలో ఆరె మరాఠ సంఘం మండల అధ్యక్షుడు కధం అనందర్‌రావు, ప్రధాన కార్యదర్శి గాడ్గే సుభాష్, నాయకులు సుభాష్‌పటేల్, మాదవపటేల్, సూర్యకాం త్, డాక్టర్‌ జ్ఞానేశ్వర్, బోస్లె దశరథ్, కదం బాబారావు, సోన్‌కాంబ్లె కృష్ణాకూమార్, కృష్ణారెడ్డి, పాల్గొన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ రాథోడ్‌ ప్రకాశ్‌ తదితరులున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement