ముందుగా టెన్త్‌ ప్రధాన పరీక్షలు | Changes in the timetable tenth examinations | Sakshi
Sakshi News home page

ముందుగా టెన్త్‌ ప్రధాన పరీక్షలు

Dec 14 2017 1:38 AM | Updated on Dec 14 2017 1:57 AM

Changes in the timetable tenth examinations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల టైం టేబుల్‌ మారింది. ఓరియంటల్‌ ఎస్సెస్సీ సబ్జెక్టులతో పరీక్ష లు ప్రారంభమయ్యేలా గతంలో టైం టేబుల్‌ జారీ చేయగా, తాజాగా ప్రధాన పరీక్షలు తొలుత ప్రారంభించేలా టైం టేబుల్‌ను సవరించి విద్యాశాఖ షెడ్యూల్‌ జారీ చేసింది. దీంతో 2018 మార్చి 15న ప్రథమ భాష పేపరు–1తో పరీక్షలు ప్రారంభమవుతాయి.గతంలో ఇచ్చిన టైం టేబుల్‌ ప్రకారం మార్చి 26న గణితం పేప రు–2 పరీక్ష రోజే శ్రీరామనవమి ఉండ టం, ఏపీలో ప్రధాన సబ్జెక్టులను తొలుత జరిపేలా షెడ్యూల్‌ చేసిన నేపథ్యంలో విద్యాశాఖ టైం టేబుల్‌ను మార్పు చేసింది. పాత టైం టేబుల్‌ ప్రకారం మార్చి 31తో పరీక్షలు ముగియనుండగా, తాజా షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 2వ తేదీతో పరీక్షలు ముగియనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement