‘ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు’ 

Chanda Venkatar Reddy Said that Democracy was in Danger - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేం ద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యం ప్రమాదం లో పడిందని సీపీఐ కార్య దర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో చేసిన అనేక వాగ్దానాల అమల్లో మోదీ విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అనే ది లేకుండా చేసేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్‌ అపహాస్యం పాలు చేస్తున్నారన్నారు. బుధవారం మఖ్దూంభవన్‌లో జరిగిన మేడ్చల్‌ జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో చాడ మాట్లాడుతూ మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా డీజీ సాయిల్‌గౌడ్‌ను నిర్ణయించారు. కేశవరం, ఏదులాబాద్‌ ఎంపీటీసీ స్థానాలకు పోటీచేయాలని నిర్ణయించారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top