ప్రకృతి చికిత్సాలయాన్ని సందర్శించిన సీఈవో | ceo visits Nature clinic | Sakshi
Sakshi News home page

ప్రకృతి చికిత్సాలయాన్ని సందర్శించిన సీఈవో

Aug 2 2015 7:35 PM | Updated on Oct 20 2018 4:36 PM

ప్రకృతి చికిత్సాలయాన్ని సందర్శించిన సీఈవో - Sakshi

ప్రకృతి చికిత్సాలయాన్ని సందర్శించిన సీఈవో

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం అక్బర్‌నగర్‌లోని ప్రకృతి చికిత్సాలయాన్ని ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు.

వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం అక్బర్‌నగర్‌లోని ప్రకృతి చికిత్సాలయాన్ని ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. యోగా శిక్షణ, మసాజ్, టబ్‌బాత్ కేంద్రం, రోగులకు అందించే ఆహారాన్ని ఆయన పరిశీలించారు. కాళ్ల నొప్పులు, బరువు తగ్గడానికి ఎలాంటి చికిత్స విధానం ఉంటుందో నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

రోగులకు అందిస్తున్న చికిత్సలు.. తదితర అంశాల గురించి ఆశ్రమ బాధ్యులు రామకృష్ణ, రాజశేఖర్ వివరించారు. ఇక్కడికి వచ్చే రోగులకు వ్యాధిని బట్టి ముడి బియ్యం, గోధుమలతో చేసిన పులక, ఉప్పు, నూనె లేని కూరలు, మొలకెత్తిన గింజలు ఇస్తామని పేర్కొన్నారు. భన్వర్‌లాల్ వెంట మండల తహశీల్దార్ సోమేశ్వర్, ఉప తహశీల్దార్ ముజీబ్, ఎంఆర్‌ఐ ఆశ్వక్ ఆహ్మద్ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement