సీబీఐటీ ప్రతిపాదన.. తిరస్కరించిన విద్యార్థులు!

CBIT students protest against fee hike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధిక ఫీజులను నిరసిస్తూ నగరంలోని సీబీఐటీ కాలేజీ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళన నాలుగోరోజుకు చేరుకుంది. శనివారం కూడా విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనపై సీబీఐటీ యాజమాన్యం స్పందించింది. ఒక్కసారిగా పెంచిన అధిక ఫీజులు చెల్లించలేమంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో.. వారి ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు సబ్‌ కమిటీ చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ఫీజు కట్టని విద్యార్థులపై ఒత్తిడి చేయబోమని, ఫీజులకు పరీక్షలకు సబంధం లేదని, ఫీజు కట్టకపోయిన పరీక్షలకు అనుమతిస్తామని యాజమాన్యం అంటోంది. ఈ నెల 22 తర్వాత పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. నిర్వహణ భారం అధికమైన నేపథ్యంలో పెంచిన ఫీజుల విషయంలో అందరికీ సడలింపు ఇవ్వలేమంటోంది.

అయితే, యాజమాన్యం ప్రతిపాదనను విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు తిరస్కరించారు. ఇటీవల అదనంగా పెంచిన రూ. 86వేల ఫీజును తగ్గించాల్సిందేనని, ఫీజుల తగ్గింపు విషయంలో యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు అంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top