18 వరకు పదో తరగతి పరీక్ష ఫీజుకు గడువు | Ap Education Dept Extended SSC Class 10 public examination fee deadline | Sakshi
Sakshi News home page

18 వరకు పదో తరగతి పరీక్ష ఫీజుకు గడువు

Dec 8 2025 4:39 AM | Updated on Dec 8 2025 4:39 AM

Ap Education Dept Extended SSC Class 10 public examination fee deadline

సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల(ఎస్‌ఎస్‌సీ–2026) ఫీజు చెల్లింపునకు పాఠశాల విద్యాశాఖ గడువు పొడిగించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆలస్య రుసుంతో ఈనెల 15వ తేదీ వరకు అవకాశం ఇవ్వగా, తాజాగా ఈనెల 18 వరకు పెంచారు.

ఆలస్య రుసుం లేకుండా ఈనెల 9వ తేదీ వరకు, రూ.50 ఆలస్య రుసుంతో 12వ తేదీ, రూ.200 ఫైన్‌తో ఈనెల 15, రూ.500 ఆలస్య రుసుంతో 18వ తేదీ వరకు అవకాశం కల్పించినట్టు ఎస్‌ఎస్‌సీ పరీక్షల డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement