ఎస్సీలుగా గుర్తించాలి | castes organization demands to add few more caste to SC's | Sakshi
Sakshi News home page

ఎస్సీలుగా గుర్తించాలి

Apr 8 2017 1:06 AM | Updated on Oct 8 2018 5:07 PM

తెలంగాణలో పూర్వపు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మదాసి కురువ, మదారి కురువ కులస్తులకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని ఆ కులాల సంక్షేమ సంఘ నాయకులు..

గెహ్లాట్‌కు మదాసి, మదారి కురువ సంక్షేమ సంఘం వినతి  
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పూర్వపు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మదాసి కురువ, మదారి కురువ కులస్తులకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని ఆ కులాల సంక్షేమ సంఘ నాయకులు.. కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్‌ చంద్‌ గెహ్లాట్‌కు విన్నవించారు. ఎంపీ రేణుకాచౌదరి ఆధ్వర్యంలో ఇక్కడ మంత్రిని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం ఇచ్చారు.

తెలంగాణలో 1976 నుంచి మదాసి కురువ, మదారి కురువ కులస్తులకు కురువ పేరుతో బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని వివరించారు. మంత్రి తక్షణం స్పందించి ఈ దిశగా విచారణ జరిపించేందుకు ఆదేశాలు జారీ చేశారని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.రంగన్న, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రంజిత్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement