బిగ్‌బాస్‌-3 షోపై కేసు నమోదు

Case File Against Big Boss Threes By Gayathri Gupta - Sakshi

ఫిర్యాదు చేసిన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గాయత్రి గుప్తా

సాక్షి, హైదరాబాద్‌: బిగ్‌బాస్‌-3 రియాలిటీ షోపై కేసు నమోదయింది. రాయదుర్గం పోలీసు స్టేషన్ గాయత్రి గుప్తా అనే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ ఈ ఫిర్యాదు చేశారు. రఘు, రవికాంత్ అనే ఇద్దరు కార్యక్రమ నిర్వహకులు ఇటీవల తనను కలిసి  బిగ్‌బాస్‌ షోలో పాల్గొనాలని అడిగారని ఆమె తెలిపారు. అనంతరం వారు షో గురించి మాట్లాడుతూ.. తనతో అసభ్యంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిగ్‌బాస్‌3కి సంబంధించి తనతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని, అనంతరం బిగ్‌బాస్‌ను ఎలా సంతృప్తి చేస్తారని అసభ్యకరరీతిలో ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. తిరిగి కొన్ని రోజుల తర్వాత షోలో అవకాశం లేదన్నారని తెలిపారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top